పట్టణాల ప్రగతే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. మధిరలో ఛైర్ పర్సన్ లతతో కలిసి కమల్‌రాజ్ మాట్లాడారు.
ఎన్నికల సమయంలో తెరాస ఇచ్చిన హామీల మేరకు ప్రజలకు అన్ని రకాల మౌళిక వసతులను కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కమల్‌రాజ్ వివరించారు.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంగా ఉన్న మధిరలో దశాబ్ద కాలంగా ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి సమస్యను ఎంపీ నామా నాగేశ్వరరావు రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సమావేశంలో తెరాస మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ ఛైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు దేవిశెట్టి రంగా రావు, అరిగే శ్రీనివాస రావు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ఐదు వేలకు చేరువలో కరోనా కేసులు