లాక్డౌన్ ప్రారంభమైన చాలా రోజుల అనంతరం కదిలిన ఆర్టీసీ బస్సులో ఖమ్మం జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్రాజు శుక్రవారం ప్రయాణించారు. మధిర ఆర్టీసీ డిపో నుంచి జిల్లా కేంద్రంతో పాటు రాజధానికి నడుపుతున్న సర్వీసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
బస్సులో భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకొని ప్రయాణించాలని అవగాహన కల్పించారు. తెరాస నాయకులతో కలిసి మధిర డిపో నుంచి కొద్ది దూరం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులకు మాస్కులు, శానిటైజర్లను జడ్పీ ఛైర్మన్ పంపిణీ చేశారు.
ఇవీ చూడండి: 'అవ్వా.. బాగున్నావా... పానం ఎట్లుంది'