ఇల్లందు మండలంలోని నర్సరీలను జిల్లా పరిషత్ సీఈవో మధుసూదన్ పరిశీలించారు.పోలారం పంచాయతీ పరిధిలో 12 వేల మొక్కలు పెంపే లక్ష్యంగా నర్సరీలను మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు.
అనంతరం కొమ్ముగూడెం, మామిడి గూడెం పంచాయతీలలో డంపింగ్ యార్డ్ నిర్మాణాలను పరిశీలించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే జరిమానా విధిస్తామని హెచ్చిరించారు. మాస్క్లు ధరించకపోతే రూ.500తో జైలు శిక్ష విధించనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: కుమారుడి అంత్యక్రియలకు 2,000 కి.మీ ప్రయాణం