ఖమ్మంలోని ఓ వ్యభిచార గృహంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. కాల్వ రోడ్డులోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు మహిళలు, ఐదుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు.
కూసుమంచికి చెందిన ఓ మహిళ వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వేశ్యాగృహం నడుపుతుందని విచారణలో తేలినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు.