ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఇంత వరకు రూ.2 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను పట్టుకున్నట్లు సీపీ విష్ణు వారియర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 44 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఎన్కూరు, రఘునాథపాలెం, బోనకల్లు, ఖమ్మం గ్రామీణ మండలం, ఖమ్మం మూడవ పట్టణ ఠాణా పరిధిలో నకిలీ విత్తనాలు పట్టుకున్నట్లు సీపీ తెలిపారు.
జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో నిషేధిత, కల్తీ, నకిలీ విత్తనాలు రైతులకు చేరకుండా చర్యలు తీసుకుంటున్నామని విష్ణు వారియర్ వివరించారు. రాష్ట్ర సరిహద్దు మండలాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Etala: 'హుజూరాబాద్‌లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం'