రాష్ట్రంలో అత్యధికంగా వలస కూలీలు ఉన్న జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధిలేక వలస కూలీలు తమ సొంత గ్రామాలకు నడక మార్గాన తరలి వెళ్తున్నారు. రోడ్డు మార్గాన నడిస్తే పోలీసులు పట్టుకుంటున్నారని మహారాష్ట్రకు చెందిన కూలీలు నాగార్జున సాగర్ కాల్వ గట్టుపై ఎనిమిది రోజులుగా నడుస్తూ.... ఖమ్మంకు చేరుకున్నారు.
అన్నం సేవ సంస్థకు చెందిన శ్రీనివాసరావు ఖమ్మం వద్ద వారిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని స్థానికంగా ఉన్న ఫంక్షన్ హాల్‌కు తరలించారు.
ఎనిమిది రోజులుగా నడుస్తున్నాం... చిన్నపిల్లలు ఆకలితో ఏడుస్తూరు, తమ గ్రామాలకు తరలించాలని కూలీలు పోలీసులను వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి: తడిసిన ధాన్యం రాశులు... తల్లడిల్లిన అన్నదాతలు