ఖమ్మం నగరంలో రోజురోజుకీ వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వాటి దాడిలో అనేక మంది గాయపడుతున్నారు. కొన్ని వీధుల్లో తిరగటానికి సైతం ప్రజలు భయపడాల్సిన పరిస్థితి. దీంతో కుక్కల సమస్యను పరిష్కరించేందుకు నగర పాలక సంస్థ చర్యలకు పూనుకుంది. ఈమేరకు రోటరీనగర్‌లో జంతు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ కేంద్రంలో ప్రత్యేకంగా వీధి కుక్కల నియంత్రణకు ఆపరేషన్లు చేయాలని నిర్ణయించింది. అందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. వారు పదిమంది సుమారు 6నెలల పాటు ఈ కేంద్రంలో ఉండి కుక్కల నియంత్రణపై పని చేస్తారు.
![dogs prevention, khammam municipal corporation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11192749_d.png)
![dogs prevention, khammam municipal corporation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11192749_do.png)
నియంత్రణ ఆపరేషన్..
ముందుగా కుక్కల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి వాటిని తీసుకువచ్చి రేబీస్ ఇంజిక్షన్, పిల్లలు పుట్టకుండా వైద్యులు ఆపరేషన్ చేస్తారు. 3 రోజులు సంరక్షణ కేంద్రంలో ఉంచుకుని తిరిగి వాటిని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే వదిలి పెడతారు. నగరంలో విపరీతంగా పెరిగిపోతున్న శునకాల దాడుల నుంచి రక్షించేందుకు నగరపాలక సంస్థ తీసుకుంటున్న చర్యల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
![dogs prevention, khammam municipal corporation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11192749_dog.png)
ఇదీ చదవండి: కేసీఆర్ కనుసన్నల్లో కాంగ్రెస్: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్