ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చడమే తమ ధ్యేయమని ఖమ్మం మేయర్ పాపాలాల్ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట.. ప్లాస్టిక్ మార్పిడి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను స్వీకరించి... వాటి బరువును బట్టి మొక్కలు, వస్త్ర సంచులు అందించారు.
మూడు కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను తెచ్చినవారికి స్టీల్ బాక్స్‌లు అందించారు. త్వరలో పప్పు దినుసులు, ఇంట్లో అవసరమైన సరుకులు అందించే ప్రత్యేక కార్యచరణ ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నగరంతో పాటు జిల్లావ్యాప్తంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో రాష్ట్రపతి రెండురోజుల పర్యటన ప్రారంభం