ETV Bharat / state

ఉమ్మడి జిల్లా ప్రజలు భయపడక్కర్లేదు: మంత్రి పువ్వాడ

కరోనా వైరస్​ ప్రభావం.. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై అంత ప్రమాదకరంగా ఏమీలేదని.. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ తెలిపారు. ఇప్పటివరకు పాజిటివ్​ వచ్చిన 11 మందిలో నలుగురు కోలుకోగా మిగతా ఏడుగురి పరిస్థితి బానే ఉందని మంత్రి వెల్లడించారు.

khammam lockdown overall review by puvvada
ఉమ్మడి జిల్లా ప్రజలు భయపడక్కర్లేదు: మంత్రి పువ్వాడ
author img

By

Published : Apr 16, 2020, 7:00 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఆఖరి కేసు 24 రోజులక్రితం నమోదైందని.. ఇంకో ఆరు రోజులు పాజిటివ్​ కేసులు నమోదు కాకపోతే.. జిల్లా ఆరెంజ్​ జోన్​ నుంచి గ్రీన్​ జోన్​లోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 403 నమూనాలను పరీక్షించగా 380 నెగిటివ్ వచ్చాయని పువ్వాడ చెప్పారు. మొత్తం నలుగురు వ్యాధి నుంచి కోలుకోగా మిగతా ఏడుగురు పరిస్థితి బానే ఉంది. ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూ.. ఇళ్లలోనే ఉంటే.. ఉమ్మడి జిల్లాను ఆరెంజ్​ జోన్​ నుంచి గ్రీన్​ జోన్​లోకి మార్చుకోవచ్చని మంత్రి తెలిపారు.

ఉమ్మడి జిల్లా ప్రజలు భయపడక్కర్లేదు: మంత్రి పువ్వాడ

ఇదీ చదవండిః ఈటీవీ కథనానికి స్పందన.. బుడగ జంగాల కూలీలకు సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.