Khammam Govt School : ఈటీవీ భారత్ కథనానికి ఖమ్మం జిల్లా అధికారులు స్పందించారు. విద్యార్థులు చదువుకునే తరగతి గదిలో గ్రీన్ బోర్డులు ఏర్పాటు చేయించారు. ఖమ్మంలోని రోటరీనగర్ మండలపరిషత్ ప్రాథమిక పాఠశాలలో.. బోర్టులు లేకుండానే చదువులు సాగుతున్నాయి. ఇక్కడ 5వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. మొత్తం ఐదు తరగతి గదులు ఉన్నాయి.
Khammam Officers responded to ETV Bharat story : మన బస్తీ- మన బడి కార్యక్రమంలో భాగంగా ఈ పాఠశాలలో మరమ్మతులు చేశారు. కొత్త రంగులు వేశారు. ఫ్యాన్లు, లైట్లు, మంచినీటి కులాయిలు ఏర్పాటు చేశారు. కానీ తరగతి గదుల్లో బ్లాక్‌బోర్డులు మాత్రం ఏర్పాటు చేయలేదు. రెండు నెలలుగా గోడలపై రాస్తూ ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువులు చెబుతున్నారు.
విషయం తెలుసుకున్న ఈటీవీ భారత్ ప్రతినిధులు పాఠశాలకు వెళ్లి పరిస్థితిపై కథనం ఇచ్చారు. గత నెలలో గోడలపైనే రాతలు.. ఇలాగైతే గోడలపైనే రాతలు.. ఇలాగైతే విద్యార్థుల తలరాత మారేదెలా? పేరుతో.. ఈటీవీ భారత్‌లో కథనం ప్రసారం అయ్యింది. ఈనాడు పత్రికలో కూడా వార్త ప్రచురితమైంది. ఈ మేరకు స్పందించిన విద్యాశాఖ అధికారులు వెంటనే కొత్త గ్రీన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు విద్యార్థులకు బోర్డులపై చదువులు చెబుతున్నారు. తమ సమస్య పరిష్కారమయ్యేలా చేసిన ఈటీవీ భారత్‌కు.. విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
"ఈటీవీ భారత్ వల్ల మాకు బోర్డులు వచ్చాయి. మంచిగా చదవగలుగుతున్నాం, పాఠాలు బాగా అర్థం అవుతున్నాయి. ముందు కేవలం పాఠశాలకు రంగులేసి పోయారు. ఇప్పుడు కొత్తగా బోర్డులు ఏర్పాటు చేశారు. మాకు ఇప్పుడు పాఠాలు మంచిగా అర్థం అవుతున్నాయి. బాగా రాస్తున్నాం. థాంక్యూ ఈటీవీ భారత్ " - విద్యార్థులు
ముందు పరిస్థితి : ఖమ్మం నగరంలోని రోటరీనగర్ పాఠశాలను.. మన బస్తీ- మన బడి (Mana Basti Mana Badi)కింద అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రూ.34,90,000 నిధులను కేటాయించింది. ఈ మొత్తంలో పాఠశాలకు రంగులు, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, ఫ్యాన్లు, విద్యుద్దీపాలు, పిల్లలు కూర్చునేందుకు బెంచ్‌లు అధికారులు ఏర్పాటు చేశారు. తరగతి గదుల్లో గ్రీన్‌బోర్డులు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు.
కానీ బడి ప్రారంభమై దాదాపు రెండు నెలలు అవుతున్నా.. తరగతి గదుల్లో టీచర్లు రాయడానికి ఎలాంటి బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో ఉపాధ్యాయులు నల్లబల్లలు లేక గోడలపైనే రాస్తూ విద్యార్థులకు పాఠాలు చెప్పారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు రాసేది అర్థం అవ్వకపోగా వారికి చదవడానికి ఇబ్బందిగా ఉండేది. ఈ విషయం తెలుసుకున్న ఈటీవీ భారత్ ప్రతినిధులు దీనిపై గత నెల కథనం రాశారు. దీంతో అధికారులు స్పందించి పాఠశాలలో గ్రీన్ బోర్డులు ఏర్పాటు చేశారు.
Telangana Schools Latest Timings : పాఠశాల సమయాల్లో మార్పులు వచ్చాయోచ్!
మార్చురీగా హైస్కూల్.. విద్యార్థులు, టీచర్లు హడల్.. ఒడిశా సర్కార్ కూల్చివేయనుందా?
దాతృత్వాన్ని చాటుకున్న క్రికెట్ గాడ్.. పేద పిల్లల కోసం స్కూల్ కట్టించి..