ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు సమీపంలో శ్రీరాంసాగర్ కాలువకు గండి పడింది. భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా శ్రీరాంసాగర్ కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. రెండు మోటర్ల ద్వారా నీటిని విడుదల చేయడం వల్ల సామర్థ్యం పెరిగిపోయింది. ఒత్తిడికి కాలువకు గండి పడింది. నీరంతా పంటపొలాల్లోకి చేరి రైతలకు తీరని నష్టాన్ని మిగిల్చింది.
ఇదివరకే చాలా సార్లు కాలువకు గండి పడ్డట్లు రైతులు చెబుతున్నారు. సమస్య గురించి అధికారులకు విన్నవించినా ఎలాంటి లాభం లేదని వాపోతున్నారు. భక్త రామదాసు ప్రాజెక్ట్ ద్వారా నాలుగు మండలాలకు చెరువులు నింపేందుకు నీటిని విడుదల చేసినప్పుడల్లా ఇదే పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువకు మరమ్మత్తులు చేయించాలని కోరుతున్నారు.