ETV Bharat / state

స్వదేశానికి దారిలేక.. సురక్షిత వాతావరణం లేక.. విద్యార్థుల అవస్థలు

Khammam district students in Ukraine: ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో యుద్ధభూమిపై భీకర పరిస్థితులు నెలకొన్నాయి. వరుస క్షిపణి దాడులతో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని జీవిస్తున్నారు. విద్య, ఉద్యోగాల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వెళ్లిన విద్యార్థులు, యువత పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సొంతూళ్లకు వచ్చే దారిలేక.. అక్కడ సురక్షిత వాతావరణం లేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Khammam district students in Ukraine
ఉక్రెయిన్​లో చిక్కుకున్న ఖమ్మం విద్యార్థులు
author img

By

Published : Feb 25, 2022, 8:45 PM IST

ఉక్రెయిన్​లో చిక్కుకున్న విద్యార్థుల గోడు

Khammam district students in Ukraine: ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఉన్నత చదువులు, ఉపాధి కోసం వెళ్లి.. యుద్ధ వాతావరణంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలువురు విద్యార్థులు, యువత.. వైద్య విద్య, ఉద్యోగాల కోసం ఉక్రెయిన్​కు తరలివెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వదేశానికి తరలివచ్చే మార్గం లేక.. అక్కడ సరైన సమాచారం ఇచ్చే వారు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. గురువారం రాత్రి నుంచి నిద్రాహారాలు కరవై భయభయంగా కాలం వెళ్లదీస్తున్నారు.

తల్లిదండ్రుల ఆందోళన

ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం మెడిదపల్లి పాలెం గ్రామానికి చెందిన రావుల మహేశ్​ రెడ్డి.. ఆరు నెలల క్రితం హోటల్ మేనేజ్​మెంట్​ కోసం ఉక్రెయిన్ వెళ్లారు. ఉక్రెయిన్ మీద యుద్ధ మేఘాలు కమ్ముుకోవడంతో.. మహేశ్​ తల్లిదండ్రులు ఉపేందర్ రెడ్డి, వెంకట నర్సమ్మ ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడిని క్షేమంగా ఇంటికి తీసుకురావాలని ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిని క్షేమంగా ఇంటికి చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని మీడియాతో వేడుకున్నారు.

ఉక్రెయిన్​లో భీకర పరిస్థితులతో ఆందోళన చెందుతున్నట్లు మహేశ్​ సెల్ఫీ వీడియోలో వివరించారు. త్వరగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.

'గురువారం రాత్రి ఒడిశాలో క్లిష్ట పరిస్థితులు ఉండటంతో.. రైల్లో లెవీకి తరలివచ్చాం. ఇక్కడి నుంచి రవాణా సౌకర్యం ఉందన్నారు. కానీ ఇక్కడికి వచ్చాక మాకు ఎటువంటి సదుపాయాలు కల్పించడం లేదు. ఇక్కడ తలదాచుకోవడానికి కూడా స్థలం లేకపోవడంతో.. ఏం చేయాలో పాలుపోవడం లేదు. కనీసం క్యాబ్​లు కూడా నడవడం లేదు. దాదాపు 300 మంది వరకు ఇక్కడే చిక్కుకుపోయాం. ఈ విషయంపై ఇండియన్​ ఎంబసీ స్పందించి.. మమ్మల్ని త్వరగా స్వదేశానికి తరలించాలని వేడుకుంటున్నాం.' -మహేశ్​, బాధితుడు

ఉమ్మడి జిల్లా నుంచి అనేక మంది

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఉభయ జిల్లాలకు చెందిన చాలామంది విద్యార్థులు ఉక్రెయిన్​లోని పలు పట్టణాల్లో ఉంటున్నారు. వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లిన వారు అధికంగా ఉండగా.. మరికొందరు హోటల్ మేనేజ్​మెంట్ కోర్సులు చేసేందుకు వెళ్లిన వారున్నారు. ఇంకా కొంత మంది యువత ఉద్యోగాల కోసం వెళ్లి.. యుద్ధం కారణంగా అక్కడే చిక్కుకున్నారు. వీరంతా ఉక్రెయిన్ రాజధాని కీవ్​తోపాటు వినీష్టియా, ఇవానో, ఫ్రాంక్విస్క్, ఖార్కివ్ తదితర నగరాల్లో ఉంటున్నారు.

"ప్రస్తుతం యూనివర్సిటీ హాస్టళ్లో అయితే సురక్షితంగా ఉన్నాం. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. సర్టిఫికెట్స్​, పాస్​పోర్టులు సిద్ధంగా ఉంచుకోమన్నారు. ఏదైనా క్లిష్ట పరిస్థితి వస్తే వేరే ప్రాంతానికి తరలివస్తాం. ఇండియన్​ ఎంబసీకి కాంటాక్టు అవడానికి అక్కడి నుంచి ఎమర్జెన్సీ ఫోన్​ నంబర్లు ఇచ్చారు." -బాధితురాలు ​

భయంభయంగా

యుద్ధం ప్రారంభమైన రోజు నుంచీ గంట గంటకూ తమ పిల్లల యోగ క్షేమాలను తల్లిదండ్రులు తెలుసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు క్షేమ సమాచారం తెలుసుకుంటూనే బంధువులు, స్నేహితులు ధైర్యం చెబుతున్నారు. అయితే ఎప్పుడు ఎక్కడ నుంచి బాంబుల మోత వినాల్సివస్తుందోనన్న భయంతో.. అక్కడ ఉన్న విద్యార్థులు, ఇక్కడున్న తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వీరంతా సురక్షిత ప్రాంతాల్లోనే ఉన్నప్పటికీ అక్కడి పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియక ఆందోళన నెలకొంది. తమ పిల్లలను క్షేమంగా స్వస్థలాలకు చేర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని తల్లిదంద్రులు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.