లాక్‌డౌన్ నేపథ్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో ఆత్మస్థైర్యం నింపి ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. సభ్యులకు కొవిడ్-19 రుణాలను అందించాలని నిర్ణయించింది. రుణాల మంజూరు విషయంలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచినట్లు డీపీఎం ఆంజనేయులు తెలిపారు. సంఘానికి రూ.50 వేలు అందిస్తున్నారు. సంఘంలో 10 మంది సభ్యులు ఈ రుణాన్ని రూ.5 వేల చొప్పున తీసుకుంటున్నారు. ఏప్రిల్ 15 నుంచి పలు బ్యాంకులు ఈ రుణాలు అందిస్తున్నారు.
ఖమ్మం జిల్లాలోని 23,813 ఎస్‌హెచ్‌జీలకుగాను రుణాన్ని పొందేందుకు 11,942 సంఘాలను ఎంపిక చేశారు. వీటిలో కూడా 9 వేల సంఘాలు ఈ రుణాలు తీసుకునేందుకు ముందుకొచ్చాయి. అయితే ఇప్పటి వరకు 1,455 సంఘాలకు రుణాలు అందించారు. భద్రాద్రి జిల్లాలో 270 సంఘాలకు ఆర్థికసాయం అందించారు.
ఇదీ చూడండి : నర్సులకు వందనం..మీ సేవలకు సలాం...