ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లాక్డౌన్ను ఉల్లంఘిస్తూ దాదాపు 40శాతం మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఓ వైపు పోలీసులు, అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్లపై ఇష్టానుసారంగా తిరిగారు.
ఖమ్మం కలెక్టర్ కర్ణన్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అధికారులతో సమీక్ష సమావేశాలు, టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించారు. జనం ఇష్టానుసారం రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై ఇష్టానుసారం తిరిగితే కేసులు పెడతామని వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడిండి: ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ మార్గదర్శకాలివే...