ఖమ్మం నగరంలో ప్రధాన రహదారుల వెంట బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాపర్తి నగర్ కూడలిలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ప్రధాన కేంద్రాల వద్ద బస్ షెల్టర్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పార్టీ నేతలు అన్నారు. వెంటనే నగరపాలక సంస్థ పాలక వర్గం స్పందించి బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఇవీ చూడండి : కరోనా వస్తే.. కేంద్రం కాలర్ ట్యూన్ పెట్టి వదిలేసింది: భట్టి