ETV Bharat / state

కవితను వెంటనే అరెస్టు చేయాలని కలెక్టరేట్​ ముట్టడి - Khammam latest news

Khammam Collectorate besieged: ఖమ్మం జిల్లాలోని కలెక్టరేట్​ను భాజపా కార్యకర్తలు ముట్టడించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. లిక్కర్ స్కామ్​లో ఉన్న ఎమ్మెల్సీ కవితను వెంటనే అరెస్టు చేయాలని ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో భాజపా కార్యకర్తలు ఆందోళన చేశారు.

kmm
kmm
author img

By

Published : Dec 8, 2022, 5:47 PM IST

Khammam Collectorate besieged: లిక్కర్ స్కామ్​లో ఉన్న ఎమ్మెల్సీ కవితను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో భాజపా కార్యకర్తలు ఖమ్మం కలెక్టరేట్​ను ముట్టడించారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. భారీ సంఖ్యలో వచ్చిన ఆందోళనకారులు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఈ క్రమంలో కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్రంగా తోపులాట జరిగింది. ఆందోళనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్​కు తరలించారు. సారా కేసులు అని ఎస్టీ మహిళలను పోలీసులు అప్పట్లో వేధింపులకు గురిచేసి అరెస్టులు చేసేవారని... మరి ఇప్పుడు సారా కేసులో ఉన్న కవితను ఎందుకు అరెస్ట్ చేయరని ప్రశ్నించారు.

లిక్కర్ స్కామ్​లో కవితను వెంటనే అరెస్టు చేయాలని కలెక్టరేట్​ ముట్టడి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.