ETV Bharat / state

ఇఫ్తార్​ కిట్లు పంచిన ఖమ్మం కలెక్టర్ - సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెెంకట వీరయ్య

రంజాన్​ పండుగ సందర్భంగా ముస్లింలు భౌతిక దూరం పాటిస్తూ ప్రార్థన చేసుకోవాలని ఖమ్మం కలెక్టర్​ కర్ణన్​ సూచించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో వెయ్యిమంది ముస్లింలకు ఇఫ్తార్​ విందు కిట్లను కలెక్టర్​ చేతుల మీదుగా పంపిణీ చేశారు.

Khammam Collector Distributes Ramjan Iftar Kits For Muslims
ఇఫ్తార్​ కిట్లు పంచిన ఖమ్మం కలెక్టర్
author img

By

Published : May 23, 2020, 10:41 PM IST

ఖమ్మం జిల్లా సత్తపల్లిలో స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేతుల మీదుగా ఖమ్మం జిల్లా కలెక్టర్​ కర్ణన్ ముస్లింలకు ఇఫ్తార్​ కిట్లు పంపిణీ చేశారు. లాక్​డౌన్​ సమయంలో సత్తుపల్లి శాసన సభ్యులు చేస్తున్న సామాజిక సేవ ఎప్పటికీ గుర్తుండిపోతదని కలెక్టర్​ అన్నారు. ప్రజా ప్రతినిధులు, పార్టీల నేతలు ఎమ్మెల్యేను ఆదర్శంగా తీసుకొని పేదలకు సాయం చేయాలని సూచించారు. రంజాన్​ సందర్భంగా ముస్లింలు గుమిగూడవద్దని, భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించి ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు.

కరోనా నివారణకు ప్రతీ ఒక్కరు సహకరించాలని, మాస్కు లేనిదే.. బయటకు రావద్దని, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. రంజాన్​ మాసంలో నియోజకవర్గంలోని 5వేల మంది పేద ముస్లింలకు రంజాన్​, ఇఫ్తార్​ కిట్లు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శివాజీ, తహసీల్దార్​ మీనన్​, మున్సిపల్​ ఛైర్ పర్సన్​ కూసంపూడి మహేష్​, వైస్​ ఛైర్ పర్సన్​ తోట సుజల రాణి, ఎంపీపీ దొడ్డ హైమావతి, జడ్పీటీసీ సభ్యుడు రామారావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఆరు గాయాలుంటే ఒకటే అంటారేం..?:హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.