ETV Bharat / state

కేసీఆర్ విందు మరి మామూలుగా ఉండదు.. 17 రకాల నాన్‌ వెజ్‌, 21 రకాల వెజ్‌! - BRS PUBLIC MEETING menu list

BRS PUBLIC MEETING LUNCH MENU ITEMS ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగసభకు సర్వం సిద్ధమైంది. అసలే ముగ్గురు ముఖ్యమంత్రులు.. జాతీయ కీలక నేతలు వస్తున్నారు. ఇక వారికి విందు ఎలా ఉండాలి. తెలంగాణ రుచులు చూపించాలని కేసీఆర్.. రకరకాల ఐటెమ్స్ తయారు చేయిస్తున్నట్లు సమాచారం. 17 రకాల నాన్‌ వెజ్‌, 21 రకాల వెజ్‌ వంటలు సిద్ధం చేయనున్నారు. మెనూ ఐటెమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

KHAMMAM BRS PUBLIC MEETING LUNCH MENU ITEMS LIST
కేసీఆర్ విందు మరి మామూలుగా ఉండదు.. 17 రకాల నాన్‌ వెజ్‌, 21 రకాల వెజ్‌!
author img

By

Published : Jan 17, 2023, 6:07 PM IST

BRS PUBLIC MEETING LUNCH MENU ITEMS ఖమ్మం నూతన కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం, బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు హాజరయ్యే ముఖ్యఅతిథులకు ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చేందుకు పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటోంది. ముగ్గురు ముఖ్యమంత్రులు కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, పినరయి విజయన్‌, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌యాదవ్‌, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితరులకు ఉదయం అల్పాహారం, ఖమ్మంలో భోజనం మెనూను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తోంది.

తెలంగాణ సంప్రదాయ వంటలను అతిథులకు రుచి చూపించనుంది. 17 రకాల నాన్‌ వెజ్‌, 21 రకాల వెజ్‌ వంటలు సిద్ధం చేయనుంది. మటన్‌ బిర్యానీ, చికెన్‌ దమ్‌ బిర్యానీ, ప్రాన్‌ బిర్యానీ, కొరమేను కూర, తెలంగాణ మటన్‌ కర్రీ, తలకాయ ఇగురు, నాటుకోడి కూర, బొమ్మిడాయల పులుసు, బోటీ ఫ్రై, మటన్‌ లివర్‌ ఫ్రైతో విందు ఇవ్వనుంది. పనీర్‌ బటర్‌ మసాలా, మెతీ చమన్‌, దాల్‌ తడ్కా, బచ్చలకూర మ్యాంగో పప్పు, బీరకాయ శనగపప్పు కూర, బెండకాయ కాజు ఫ్రై, ముద్దపప్పు, పచ్చిపులుసు వంటి వెజ్‌ కూరలు సిద్ధం చేయనుంది. ఈ మెనూతో మొత్తం 500 మంది విందు ఆరగించనున్నారు.

భారీ నిఘా: నలుగురు ముఖ్యమంత్రులు, మాజీ సీఎం, పలువురు జాతీయ నేతలు ఖమ్మంలో పర్యటిస్తున్నందున తొమ్మిది మంది ఐపీఎస్‌ల పర్యవేక్షణలో బందోబస్తు కొనసాగనుంది. మొత్తం 4,202 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. అదనపు డీజీ విజయకుమార్‌, ఐజీపీలు షానావాజ్‌ ఖాసీం, చంద్రశేఖర్‌రెడ్డి, వరంగల్‌ పోలీసు కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌, డీఐజీలు కె.రమేష్‌నాయుడు, ఎల్‌.ఎస్‌.చౌహాన్‌, ఖమ్మం పోలీసు కమిషనర్‌ విష్ణు వారియర్‌, భద్రాద్రి, మహబూబాబాద్‌ ఎస్పీలు వినీత్‌, శరత్‌చంద్ర భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు.

పది మంది అదనపు ఎస్పీలు, 39 మంది ఏసీపీలు, 139 మంది సీఐలు, ఎస్సైలు 409 మంది, హెడ్‌ కానిస్టేబుళ్లు 530 మంది, కానిస్టేబుళ్లు 1,941 మంది, హోంగార్డులు 1,005 మంది, స్పెషల్‌ పార్టీ పోలీసులు 120 మంది విధులు నిర్వర్తించనున్నారు.

ఇవీ కూడా చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.