తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఖమ్మంలో నిరసన తెలిపారు. అనంతరం పెవిలియన్ మైదానం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉందని.. గ్రామాల్లో తమకు ఎవరూ సహకరించట్లేదని వాపోయారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : విషజ్వరాలు ఉన్నాయనేది వాస్తవం: మంత్రి ఈటల