ఖమ్మం జిల్లా వైరా మండలం లక్ష్మీపురంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు ఈ జాతర జరగనుంది. అందులో భాగంగా నిన్న రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
తొలిరోజు కల్యాణ మహోత్సవం నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు, రెండో రోజు నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. వివిధ మండలాల నుంచి వచ్చిన భక్తులు రాత్రి 12 గంటల వరకు ఆసక్తిగా తిలకించారు.
ఇదీ చూడండి: 'రష్మికకు ట్వీట్ చేసింది కలెక్టర్ కాదు.. పరిశ్రమలశాఖ ఉద్యోగి'