ఖమ్మం జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఫ్రీజర్ బాక్సులు పనిచేయకపోవడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసుపత్రిలో మృతదేహాలు కుళ్లిపోతున్నాయని పలు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా హెచ్చార్సీ సుమోటోగా స్వీకరించింది.
సెప్టెంబర్ 18లోపు సమగ్ర నివేదిక...
రోజులు గడుస్తున్నా ప్రీజర్లు రిపేర్ చేయించకపోవడం వల్ల మృతదేహాలు కుళ్లిపోతున్నాయని పేర్కొంది. ఈ దశలో సిబ్బంది మాత్రం ఫ్రీజర్లు పని చేయడం లేదని బోర్డు తగిలించడంపై విచారం వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై సెప్టెంబర్ 18లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఖమ్మం జిల్లా కలెక్టర్, ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు హెచ్చార్సీ ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చూడండి : ఖైరతాబాద్ ఉత్సవ సమితి చరిత్రలోనే కొత్త అధ్యాయం