ఇవీ చూడండి:హోలీరే హోలీ... భారతమంతా రంగుల మయం
ఖమ్మం జిల్లా కేంద్రంలో కేరింతలు కొడుతూ రంగుల హోలీ - khammam
ఖమ్మంలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నారులు, యువతీయువకులు రోడ్లపై డీజే చప్పుళ్ల మధ్య చిందులు వేస్తూ రంగులు చల్లుకున్నారు.
రంగుల చల్లుకుంటూ కేరింతలు కొడుతున్న యువత
ఖమ్మంలో రంగుల కేలీ హోలీని ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. చిన్నారులు, యువతీయువకులు ఉదయం నుంచి రంగులు పూసుకుంటు కేరింతలు కొట్టారు. నగరంలోని పలు హాస్టల్స్‌లో నిర్వహకులు పండుగ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 16వ డివిజన్లో కార్పొరేటర్ కమర్తపు మురళి హోలీ వేడుకలు నిర్వహించారు. డీజే ఏర్పాటు చేసి హోలీ వేడుకలు జరిపారు. టీఎస్పీఎస్సీ సభ్యురాలు డాక్టర్ బాణోతు చంద్రావతి తన ఇంటి వద్ద హోలీ వేడుకలు నిర్వహించారు.రంగులు పూసుకుంటూ అందరికి శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
ఇవీ చూడండి:హోలీరే హోలీ... భారతమంతా రంగుల మయం
sample description