నిండు వానాకాలంలోనూ ఎండలు మండిపోతున్నాయి. ఖమ్మంలో బుధవారం 40డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. గత పదేళ్ల కాలంలో జులై ఉష్ణోగ్రత ఈ నగరంలో ఇదే అత్యధికమని వాతావరణ శాఖ రికార్డులు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 2014 జులై 2న నల్గొండలో 40.4 డిగ్రీలతో మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రత 32.5 డిగ్రీలు దాటొద్దని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండగా... ఏకంగా 40కిపైగా నమోదవడం గమనార్హం. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మాదిరి వర్షాలు పడ్డాయి.
ఇదీ చూడండి: నిండుకుండలా మేడిగడ్డ... అన్నారంకు గోదారమ్మ