ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్ల మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో పాటు బలమైన గాలులతో కూడిన వర్షం పడింది. రెండు రోజులుగా ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు వాన ఊరటనిచ్చింది. వర్షం పడటం వల్ల ఖమ్మం సత్తుపల్లి జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది.
ఇవీ చూడండి: యాపిల్ విత్తనాలు తినేశారా? వాటిల్లో విషం ఉంటుందని తెలుసా!