ETV Bharat / state

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో శనివారం ఉదయం నుంచీ ఆదివారం రాత్రి వరకు విస్తారంగా వర్షం కురిసింది. రెండ్రోజుల పాటు ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో... పూర్వ జిల్లాలోని అన్ని మండలాలు తడిసిముద్దయ్యాయి. పలు మండలాల్లోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది.

HEAVY RAINS IN COMBINED KHAMMAM DISTRICT
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు
author img

By

Published : Jul 9, 2020, 1:30 PM IST

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 28.7మి.మి. వర్షపాతం నమోదు కాగా... అత్యధికంగా సత్తుపల్లి మండలంలో 51.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా మొత్తం 18.0 మి.మి.వర్షపాతం నమోదుకాగా... అత్యధికంగా అశ్వారావుపేట మండలంలో 38.4 మి.మి.నమోదైంది.

ఖమ్మం జిల్లాలో మండలాల వారీగా వర్షపాతం ( మి.మీలలో)

వర్షపాతం మి.మీలలో
సింగరేణి 47.0
కామేపల్లి33.6
రఘునాథపాలెం20.8
ఖమ్మం 23.6
తిరుమలాయపాలెం17.4
కూసుమంచి 9.4
నేలకొండపల్లి 20.0
ముదిగొండ16.8
చింతకాని22.8
ఖమ్మం అర్బన్ 21.2
కొణిజర్ల28.2
ఏన్కూరు42.2
కల్లూరు 32.8
పెనుబల్లి 35.0
సత్తుపల్లి 51.0
వేంసూరు47.8
తల్లాడ 26.6
వైరా 26.2
బోనకల్ 47.2
మధిర 20.4
ఎర్రుపాలెం11.8

భద్రాద్రి జిల్లాలో మండలాల వారీగా వర్షపాతం ( మి.మీలలో)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 18.0 మి.మి. వర్షపాతం నమోదైంది.

వర్షపాతంమి.మీలలో
అశ్వారావుపేట 38.4
జూలూరుపాడు33.2
భద్రాచలం26.2
బూర్గంపాడు25.4
దమ్మపేట23.4
అశ్వాపురం21.2
గుండాల 20.4
ఇల్లందు 16.4
దుమ్ముగూడెం18.2
ముల్కలపల్లి 15.8
చర్ల12.2
చంద్రుగొండ13.2
టేకులపల్లి12.2
కొత్తగూడెం 9.2
పాల్వంచ 6.6
మణుగూరు 9.2

గత సీజన్ కంటే ఈ సారి ఆశాజనకం

గత సీజన్ జూలై 5 నాటి కంటే ఈ సారి సీజన్​లో వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం జూన్ 1 నుంచి జూలై 5 వరకు సాధారణ వర్షపాతం 149.1 మి.మి.కాగా.. ఇప్పటి వరకు 264.2 మి.మి నమోదైంది. అంటే సుమారుగా 77.2 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ సీజన్​లో ఇప్పటి వరకు జిల్లాలో 18 మండలాల్లో అధిక వర్షపాతం నమోదుకాగా.. 3 మండలాలు కూసుమంచి, ముదిగొండ, చింతకాని సాధారణ వర్షపాతం నమోదైంది.

భద్రాద్రి జిల్లాలో జూన్ 1 నుంచి జూలై 5 వరకు సాధారణ వర్షపాతం 197.8 మి.మి. నమోదు కావాల్సి ఉండగా... ఇప్పటి వరకు 290.6 మి.మి నమోదైంది. సుమారు 46.9 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో జూన్ 1 నుంచి జూలై 5 వరకు అత్యధికంగా సింగరేణిలో 381.4 మి.మి. వర్షపాతం నమోదుకాగా... కూసుమంచి మండలంలో సాధారణ వర్షపాతం 145.6 మి.మి.నమోదైంది.

భద్రాద్రి జిల్లాలో జూన్ 1 నుంచి జూలై 5 వరకు అత్యధికంగా ముల్కలపల్లి మండలంలో 426.4 మి.మి. వర్షపాతం నమోదుకాగా... టేకులపల్లిలో 203.2 మి.మి. సాధారణ వర్షపాతం నమోదైంది. జూలైలో ఈ ఐదురోజుల్లలో ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో సాధారణ వర్షపాతం 43.9 మి.మి. కాగా.... ఇప్పటి వరకు 74.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. అంటే సుమారు 70.6 శాతం అధిక వర్షపాతం నమోదైంది. భద్రాద్రి జిల్లాలో జూలై 5 వరకు సాధారణ వర్షపాతం 53 మి.మి ఉండగా... ఇప్పటి వరకు 90.2 మి.మి వర్షపాతం నమోదైంది. సుమారు 70.1 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.