నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి ఖమ్మం నగరం తడిసి ముద్దయింది. సాయంత్రం సుమారు గంటపాటు కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని ఇల్లందు కూడలి బస్టాండ్ సెంటర్, మయూరి సెంటర్ తదితర ప్రాంతాల్లో మురుగు కాల్వలు పొంగి రోడ్డుపైకి నీరు చేరింది. ఖమ్మం బస్‌స్టాండ్‌లోకి వర్షపు నీరు చేరడం వల్ల ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
నగరంలోని రమణ గుట్టలు, దానవాయిగూడెం, సుందరయ్య నగర్, ప్రకాష్‌నగర్, ముస్తఫానగర్ ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. కుడంపోతగా కురిసిన వర్షానికి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1296 కరోనా కేసులు.. ఆరుగురు మృతి