ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పుట్టిన రోజు సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య పేదలకు కౌన్సిలర్ వనమా విశ్వేశ్వరరావు, సంఘం నేతలు కిరాణా సామగ్రి అందజేశారు. తల్లాడలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్సై తిరుపతిరెడ్డి, నేతలు పాల్గొన్నారు. అమ్మవారి పుట్టిన రోజున సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులను అతిథులు అభినందించారు.
వాసవీమాత జన్మదినాన పేద ఆర్యవైశ్యులకు సరుకుల పంపిణీ - శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పుట్టినరోజు
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జన్మదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా వైరా నియోజవకర్గంలో ఆర్యవైశ్యులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని వాసవి కల్యాణ మండపంలో నిరుపేద ఆర్యవైశ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ఆర్యవైశ్య పేదలకు సరుకుల పంపిణీ