తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ జయంత్యుత్సవాలు అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపుడిలో నిర్మించిన ఐలమ్మ విగ్రహాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఐలమ్మ జీవిత చరిత్రను సీఎం కేసీఆర్ గుర్తించి ఐదో తరగతి పాఠ్యాంశంగా చేర్చాలని వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు. భాజపా నాయకులు తెలంగాణ విమోచన దినాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సాయుధ పోరాట యోధుల పేర్లు ప్రస్తావించకుండానే విమోచన దినం పేరిట హడావుడి చేస్తున్నారని ఆగ్రహించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా కళాకారులు గీతాలతో అలరించారు.
ఇవీ చూడండి : కన్నెపల్లిలో 10వ పంప్‌తో గోదావరి జలాల ఎత్తిపోత