ప్రేమ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బాలికపై కలిసి సామూహిక అత్యాచారం జరిగింది. చీమకుర్తికి చెందిన రామయ్య ఖమ్మం జిల్లాకు బేల్దార్ పనులకు వెళ్లాడు. అక్కడ ఓ బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి చీమకుర్తి తీసుకొచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. 20 రోజులుగా బాలికను వేధిస్తూ అసభ్యకరంగా వీడియోలు తీశాడు. తన స్నహితులతో సన్నిహితంగా మెలగాలని వేధించాడు. ఆ తర్వాత నలుగురు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. భయపడిన బాలిక వారి నుంచి తప్పించుకుని ఒంగోలు చేరుకుంది. అక్కడ క్వారంటైన్‌కు తరలించారు. అక్కడ విచారించగా అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఇది చదవండి: బిడ్డ పెళ్లి లొల్లి.. తెగిన తల్లి తాళి!