శ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ఠాపన ఖమ్మం జిల్లా తనికెళ్ళలో శ్రీ విజయ గణపతి దేవాలయంలో విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం కన్నులపండువగా జరిగింది. ఉదయమే ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. యాగశాల వద్ద ప్రతిష్ఠించే విగ్రహాలు, ధ్వజస్తంభానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడిని దర్శించుకునేందుకు వివిధ గ్రామాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వచ్చారు. గత మూడ్రోజులుగా కొనసాగుతున్న ఈ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి.