ETV Bharat / state

గొప్పల కోసం తప్ప.. తెలంగాణ బిడ్డల కోసం మీరు ఆలోచిస్తున్నారా: పొంగులేటి

Ponguleti On Telangana Govt: రాష్ట్ర పాలకుల విధానాలు, ప్రభుత్వ పథకాలపై మాజీ ఎంపీ పొంగులేటి మరోసారి విరుచుకుపడ్డారు. కేవలం గొప్పలు చెప్పుకోవడం, నామస్మరణ కోసం తప్ప.. రాష్ట్ర బిడ్డల బాగోగులను గురించి పాలకులు ఆలోచించడం లేదన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర రైతాంగానికి రుణమాఫీ చేయలేదని చెబుతున్న ప్రభుత్వం, వందల కోట్లు ఖర్చు చేసి నూతన సచివాలయం ఎందుకు నిర్మిస్తోందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.

Ponguleti On Telangana Govt
Ponguleti On Telangana Govt
author img

By

Published : Feb 15, 2023, 9:41 PM IST

Ponguleti On Telangana Govt: కరోనా కారణంగా రాష్ట్ర రైతాంగానికి రుణమాఫీ చేయలేదని చెబుతున్న ప్రభుత్వం.. మరి వందల కోట్లు ఖర్చు చేసి కొత్త సచివాలయం ఎందుకు నిర్మిస్తోందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ అసమ్మతి నేత పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ప్రశ్నించారు. గొప్పలకు పోయే బదులు.. కష్టకాలంలో ఉన్న రైతులను ఆదుకునేందుకు ఆ డబ్బు ఎందుకు రుణమాఫీకి ఖర్చు చేయడం లేదన్నారు.

పేరు బ్రాండ్, నామస్మరణ కోసం తప్ప తెలంగాణ బిడ్డల బాగోగులపై పాలకులు ఆలోచించడం లేదని విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరాలో రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి మట్లాడారు. పాలకుల విధానాలు, ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేశారు. కేవలం గొప్పలు, నామస్మరణ కోసం తప్పా తెలంగాణ బిడ్డల బాగోగులను పాలకులు ఆలోచించడం లేదన్నారు.

గడిచిన 9 ఏళ్లలో తెలంగాణ బిడ్డలు కన్నకలలను ఏ మేర నెరవేర్చామన్నది, అధికారంలో ఉన్నవారు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఒక్క నెలలోనే ధరణిని క్రమపద్ధతిలో పెడతామని ప్రభుత్వం చెప్పినా, ఏడాదిన్నరగా రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 16 నెలలు దాటినా ధరణిలో పరిష్కారానికి నోచుకోని అంశాలు పదికిపైనే ఉన్నాయన్నారు.

ఈ విషయం పాలకులకు తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారా..? లేక తెలిసినా పరిష్కారం చేయొద్దన్న కృత నిశ్చయంతో ఉన్నారా అని పొంగులేటి ప్రశ్నించారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసి ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతులు ఎందుకు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ తొత్తులకే ప్రైవేటు విశ్వ విద్యాలయాలు కట్టబెడుతున్నారని.. సమయం వచ్చినప్పుడు ప్రజాకోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదని పొంగులేటి హెచ్చరించారు.

'రాబోయే ఇంకా 15 సంవత్సరాలకైనా ఆ గోదావరి నీళ్లతో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల కాళ్లు కడగగలుగుతామా, అని ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన వేదిక మీద నుంచి నేను అడుగుతున్నాను. ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఇవాళ అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులను నాయకులను అడుగుతున్నాను. ధరణి అనే అంశం ఉంది. సుమారు 15, 16 నెలలు అయినా.. ఈరోజుకి పదుల సంఖ్యలో ఈ ధరణిలో పరిష్కారం కానీ అంశాలు పాలకులకు తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారా..? లేక తెలిసినా పరిష్కారం చేయొద్దన్న కృత నిశ్చయంతో ఉన్నారా అని ఈ వేదికగా నేను ప్రశ్నిస్తున్నాను'. -పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, మాజీ ఎంపీ

గొప్పల కోసం తప్పా, తెలంగాణ బిడ్డల కోసం మీరు ఆలోచిస్తున్నారా: పొంగులేటి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.