ETV Bharat / state

సొంత మొక్కైనా అనుమతేది?

యజమాని పెంచుకున్న సొంత చెట్లను నరకటానికైనా వాల్టా చట్టం ప్రకారం అనుమతి తీసుకోవాలని అటవీశాఖ అధికారులు సూచించారు.

author img

By

Published : Feb 18, 2019, 6:14 AM IST

Updated : Feb 18, 2019, 7:39 AM IST

కలప
కలప పట్టివేత
ఖమ్మం జిల్లా మర్లకుంటలో అటవీశాఖ అధికారులు ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులు చేశారు. అనుమతి లేకుండా నిల్వ చేసిన కలపను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం సొంత చెట్టు నరకడానికైనా అనుమతి తీసుకొని, చలానా చెల్లించాలని సత్తుపల్లి రేంజ్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.
undefined

కలప పట్టివేత
ఖమ్మం జిల్లా మర్లకుంటలో అటవీశాఖ అధికారులు ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులు చేశారు. అనుమతి లేకుండా నిల్వ చేసిన కలపను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం సొంత చెట్టు నరకడానికైనా అనుమతి తీసుకొని, చలానా చెల్లించాలని సత్తుపల్లి రేంజ్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.
undefined
Intro:TG_KRN_101_17_ATTN_ETV BHARATH_ELLA KALA KSHATHRA BANDAGHARAM_PKG_C11
FROM:KAMALAKAR HUSNABAD C11
CELL:9441842417
----------------------------------------------------------------------------
సిద్దిపేట్ జిల్లా హుస్నాబాద్ పట్టణం లో శ్రీ నాదమునుల రామారావు గారు కవి, చిత్రకారుడు, రచయిత, గాయకుడు, నటుడు, షార్ట్ ఫిల్మ్ నిర్మాత, అధ్యాపకుడు, సామాజిక కార్యకర్త, ఫోటోగ్రాఫర్, ప్రకృతి ప్రేమికుడు, జంతు ప్రేమికుడు, వస్తు ప్రేమికుడు, తెలుగు భాషా ప్రేమికుడు, తెలుగు వెలుగు వ్యవస్థాపకుడు, ఇలా వివిధ కళారూపాలను తనలో ఇముడ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. అంతేకాకుండా తన ఇంటినే ఒక కళాక్షేత్ర భాండాగారం గా మలిచారు. తనలో ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ సమాజంలో ఒక సాదాసీదా వ్యక్తి గా, తనకంటే చిన్న వారితో నైనా మర్యాదగా నడుచుకునే ఒక గొప్ప వ్యక్తి నాదమునుల రామారావు గారు. విజన్ టుడే అనే ట్యూషన్ సెంటర్ నెలకొల్పి విద్యార్థులకు ట్యూషన్ తో పాటు నైతిక విలువలతో కూడిన జ్ఞానాన్ని అందిస్తూ వారి భవిష్యత్తుకు ఉన్నతమైన బాటలు వేస్తున్నారు. వివిధ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తూ నైతిక విలువలను కూడా నేర్పిస్తున్నారు. రామారావు గారు ఎం ఏ ఇంగ్లీష్ చేసినప్పటికీ, ఇంగ్లీష్ భాషలో అపారమైన జ్ఞానం సంపాదించినప్పటికీ, తెలుగు భాష పట్ల ప్రత్యేకమైన అభిమానం కలిగి ఉండి తెలుగు భాషాభివృద్ధికి అనేక రచనలు, నవలలు రచించడం జరిగింది. హుస్నాబాద్ డివిజన్లో తెలుగు వెలుగు అనే సంస్థను స్థాపించిన వ్యవస్థాపకుల్లో రామారావు గారు ప్రముఖులు. దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం నాటి తెలుగు, ఆంగ్లం, హిందీ, మలయాళం భాషలలోని ప్రాముఖ్యమైన పుస్తకాలను సేకరించి, వాటిని చదివి వాటి సారాంశం ను తన మదిలో ఉంచుకొని సమాజంలోని భావితరాలకు వాటిలో ఉన్న సారాంశాన్ని వివరించడం, ఆ జ్ఞానాన్ని అందించటం ఒక గొప్ప విషయమైతే, బయట షాపుల్లో అట్ట డబ్బాలను సేకరించి, అవసరమైతే అట్ట డబ్బాలను డబ్బుతో కొని కొన్ని వేల పుస్తకాలను వాటిలో భద్రపరచడం అనేది మరొక గొప్ప విషయం. అదేవిధంగా గత 60 సంవత్సరాల నుండి వార్తాపత్రికలను సేకరించి వాటిని కూడా ఒక క్రమపద్ధతిలో భద్రపరచడం అనేది మరొక గొప్ప విషయం. ఆ వార్తా పత్రికల్లో ముఖ్యమైన వార్తలను కట్ చేసి వాటిని కూడా అట్ట డబ్బాలలో భద్రపరచడం విశేషం. రామారావు సార్ గారు స్వయంగా చిత్రకారుడు వివిధ చిత్రాలతో పాటు ఆయన తండ్రి చిత్రం కూడా ఎంతో అద్భుతంగా గీశారు. అదేవిధంగా తన తండ్రి దగ్గర నుండి లభించిన తాళపత్ర గ్రంథాన్ని జాగ్రత్తగా భద్రపరచడం రామారావు గారి గొప్పతనానికి నిదర్శనం. గ్రామఫోన్, పాత కెమెరాలు, పురాతన నాణాలు, తన పెళ్లినాటి దండలు బాసింగాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో వస్తువులు, పుస్తకాలు,కళకండలు రామారావు సర్ గారి గృహం లో దర్శనమిస్తాయి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో వివిధ రంగాలలో కనబర్చిన ప్రతిభకు గాను రెండుసార్లు స్థానం సంపాదించారు. రామారావు సార్ గారు వరంగల్ వాస్తవ్యులు గత 15 సంవత్సరాల నుండి హుస్నాబాద్ లో స్థిరపడ్డారు. తన తండ్రి పేరు దశరధ రామయ్య (రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయుడు) తల్లి పేరు అనసూయ. తను కిరాయి ఉంటున్న ఇంట్లో మూడు గదులలో పూర్తిగా ప్రతి గది పుస్తకాలతో, పేపర్లతో, పురాతన వస్తువుల తో, కళాఖండాలతో నిండి ఉండడం వాటిని జాగ్రత్తగా భద్రపరచడం అనేది రామారావు సార్ గారి గొప్పతనం. కాళోజీ నారాయణరావు గారి చేత, సి.నారాయణరెడ్డి గారి చేత ప్రశంసా పత్రాలు పొందారు. వేలకొలది సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనేక నాటకాలలో నటించారు. పలు సినిమాలలో కూడా నటించడం జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు మొదలైన అలనాటి మహానటులతో పరిచయం కలిగిన వ్యక్తి. వారి అనుభవాలను పంచుకున్న వ్యక్తి రామారావు గారు. జంతు ప్రేమికుడిగా 13 ,14 సంవత్సరాలు ఒక పిల్లిని పెంచుకొని దానిపై లఘు చిత్రం కూడా తీయడం జరిగింది. ఎన్నో పురస్కారాలు, ఎన్నో సర్టిఫికెట్లు, ఎన్నో ప్రశంస పత్రాలు పొందారు రామారావు సార్ గారు. రామారావు సార్ గారికి సంతానం లేదు. ఆయన ఆయన సతీమణి అభినందన స్కూల్ పిల్లలకు ట్యూషన్లు చెపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. రామారావు సార్ గారి సతీమణి ఆయనకు అన్ని విషయాలలోఎల్లవేళలా సహకారం అందిస్తున్నారు. రామారావు సార్ గారికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. సేకరించిన పుస్తకాలు, వస్తువులు,నాణలు, ఇతర కళాక్షేత్ర భాండాగారాలు తన ఆస్తి అంటారు ఆయన. తన తదనంతరం సేకరించిన ఈ కళాక్షేత్ర ఉపకరణాలు భావితరాలకు అందేలా కృషి చేస్తానని ఆయన అంటున్నారు. ఆయన లో ఉన్న జ్ఞానానికి ఒక పెద్ద ఉద్యోగం చేపట్టవచ్చు, ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సమాజంలో తన వంతుగా వివిధ కార్యక్రమాలు చేపట్టి సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికి కృషి చేయాలన్నదె రామారావుగారి అభిమతం. ఆయన గృహన్ని సందర్శిస్తే మనకు ఒక అద్భుతమైన మ్యూజియాన్ని సందర్శించిన అనుభూతి కలుగుతుంది. ఆయనకు హుస్నాబాద్ డివిజన్లో ఒక ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ ఆయన వస్త్రధారణ మొదలుకొని ఆయన నడుచుకునే విధానం చాలా నిరాడంబరంగా సాదాసీదా గా ఉంటుంది. ఆయన గృహాన్ని సందర్శించిన పలువురు ప్రముఖులు ఎంతో సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. రామారావు సార్ గురించి చెప్పుకుంటూ పోతే రాయడానికి కాగితం కానీ చెప్పడానికి మాటలు గాని సరిపోవు. ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప వ్యక్తిత్వం గల మహానుభావుడు.


Body:బైట్స్

1) మాదాసు సత్యనారాయణ గారు ( రిటైర్డ్ MEO మరియు గాయకుడు)

2) వడ్డేపల్లి మల్లేశం గారు ( రిటైర్డ్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు, కవి, సామాజిక సేవకుడు)

3) ఎర్రమరాజు దేవరాజు ( రిటైర్డ్ ఉపాధ్యాయుడు మరియు గాయకుడు)

4) ఎం.డి. ఫరాజ్ (9వ తరగతి విద్యార్థి)

5) శ్రీమతి అభినందన, రామారావు సార్ గారి అర్ధాంగి ( విద్యాభ్యాసం M.COM.మరియు ఆర్టిస్ట్)

6) నాదమునుల రామారావు సార్ గారు ( బహుముఖ ప్రజ్ఞాశాలి)


Conclusion:రామారావు సార్ గారి ఇల్లే ఒక కళాక్షేత్ర భాండాగారం.
Last Updated : Feb 18, 2019, 7:39 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.