ఖమ్మం జిల్లా చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంటలు వ్యాపించడంతో వైద్య సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అర్ధరాత్రి దాటాక పెద్ద శబ్దంతో విద్యుత్ బోర్డు వద్ద మంటలు వ్యాపించినట్లు విధుల్లో ఉన్న సిబ్బంది తెలిపారు. బయటకు వెళ్లి స్థానికులకు విషయం చెప్పారు. విద్యుదాఘాతం వల్ల మంటలు వ్యాపించినట్లు గుర్తించారు.
ప్రధాన హాల్‌తో పాటు కరోనా టీకాలు నిల్వ ఉంచే గదిలో మంటలు వ్యాపించాయి. ఆస్పత్రిలోని అన్ని గదుల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇదీ చూడండి: టాప్‌టెన్ న్యూస్ @ 11AM