ETV Bharat / state

రైతులకు కడగండ్లు మిగిల్చిన కరోనా - raithu

కరోనా లాక్ డౌన్ ప్రభావం ఖమ్మం జిల్లా రైతులకు తీరని నష్టం కలిగిస్తోంది. సరైన రవాణా లేక, కోతలకు కూలీలు రాక అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. మిర్చి రైతులు పంటను భద్ర పరచుకోడానికి శీతలగిడ్డంగుల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు.

farmers-facing-hardship-due-to-corona-lockdown
రైతులకు కడగండ్లు మిగిల్చిన కరోనా
author img

By

Published : Apr 4, 2020, 1:36 PM IST

Updated : Apr 4, 2020, 4:26 PM IST

కరోనా నిర్మూలనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ ఖమ్మం జిల్లాలో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది . మిరప సాగు చేసిన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. మిరప ధర ఈ ఏడాది ధర ఆశాజనకంగా ఉందనే ఆనందంలో ఉన్న కర్షకులకు చివరకు నిరాశే మిగిలింది. తొలి కోత పూర్తై మంచి గిరాకీ వస్తుందని ఆశించిన సమయంలో కరోనా లాక్ డౌన్ ప్రకటన వెలువడింది. దీంతో అమ్ముకునే వీలు లేక ఏమి చేయాలో తెలియక రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

రైతులకు కడగండ్లు మిగిల్చిన కరోనా

లాక్‌డౌన్‌ ఎత్తేసే వరకు శీతల గిడ్డంగుల్లో భద్రపరుచుకుందామంటే అక్కడ కూడా ఇబ్బందులే తలెత్తున్నాయి. గిడ్డంగుల వద్ద హమాలీలు తక్కువగా ఉండటంతో రోజుల తరబడి బారులు తీరిన వాహనాలతో పడిగాపులు కాయాల్సి వస్తోంది. జిల్లాలో ఎక్కడ చూసినా గిడ్డంగుల వద్ద వందల సంఖ్యలో ట్రాక్టర్లు, మినీ వ్యాన్లు కనిపిస్తున్నాయి. మరో వైపు రెండో కోత కోసేందుకు కూలీలు దొరక్క ఆందోళన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు స్వస్థలాకు తిరిగి వెళ్లి పోయారు. స్థానికంగా ఉన్న కూలీలను ఆటోలలో మిరప కోతకు తీసుకెళ్లేందుకు అనుమతించకపోవడంతో పొలాల్లోనే మిరప పంట ఎర్రబారుతోంది. గత నెలలో కురిసిన అకాల వర్షం కొంత దెబ్బతీయగా కరోనా లాక్ డౌన్ ప్రభావం పుండు మీద కారం చల్లినట్లు కుంగదీసింది.

మిరప రైతుల పరిస్థితి ఇలా ఉంటే కూరగాయలు సాగు చేసిన రైతుల పరిస్థితి మరింత ఆగమ్యగోచరంగా ఉంది. లాక్ డౌన్ కారణంగా కూరగాయల విక్రయాలకు ఉదయం వేళలో నిర్ణీత సమయం కేటాయించడంతో రైతుల నుంచి వ్యాపారులు తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. తీరా విక్రయాలకు సమయం పెంచిన తరువాత పొలాల్లో కోత కొచ్చిన కాయలు పాడవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఖమ్మం జిల్లా హిమాంనగర్‌లో ఓ రైతు రెండు ట్రక్కుల వంకాయలు వాగులో పోయాల్సి వచ్చింది. జనతా కర్ఫ్యూ నాటికే వంకాయలు కోతకు రాగా ఆ తర్వాత నాలుగు రోజులు కూలీలు దొరక లేదు. దీంతో వంకాయలు తోటల్లోనే ముదిరి పోయాయి. టమాటాలు ఎర్రబారి పాడయ్యాయి.

లాక్‌డౌన్‌ సమయంలో రైతులకు కొంత వెసులుబాటు కల్పించాలని, దిగుబడులు మార్కెట్‌లకు తరలించే విధంగా అన్నీ వాహనాలకు రవాణాకు అనుమతి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. కూరగాయల విక్రయానికి నిర్ణీత సమయాన్ని తొలిగించాలని, నిబంధనలు పాటిస్తూ విక్రయించుకునే అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు. కూలీల ఆటోలు అనుమతించాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.

Last Updated : Apr 4, 2020, 4:26 PM IST

For All Latest Updates

TAGGED:

raithu
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.