ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాదం జరిగింది. ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. మధిర నీటిపారుదల శాఖ జూనియర్ అసిస్టెంట్ వై. నాగరాజు సత్తుపల్లిలోని జ్యోతి నిలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి కేంద్రానికి వచ్చాడు. అందరిలాగే తనకు కేటాయించిన కేంద్రం తాలూకు సామగ్రి తీసుకుంటుడగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. హుటాహుటిన అతన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.
సత్తుపల్లి నియోజకవర్గంలో 280 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 1250 మంది సిబ్బంది విధులకు హాజరయ్యారు. పోలింగ్ సామగ్రి తీసుకుని వారికి కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు.
ఇదీ చదవండి: నిబంధనలు అతిక్రమించిన ఉపాధ్యాయురాలి సస్పెండ్