ETV Bharat / state

హనుమాన్ బజార్​లో కిరాణా సరుకులు పంపిణీ

లాక్​డౌన్ కొనసాగుతోన్న నేపథ్యంలో ఉపాధి లేక సామాన్యులు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో పలు పార్టీలు, అసోసియేషన్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాయి.

వైరాలో నిత్యావసర సరుకుల అందజేత
వైరాలో నిత్యావసర సరుకుల అందజేత
author img

By

Published : May 3, 2020, 4:50 PM IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వైరాలో ఎమ్మెల్యే రాములు నాయక్ నిరుపేదలు, ఫోటోగ్రాఫర్‌లకు కూరగాయలు, సరుకులు పంపిణీ చేశారు. వైరా హనుమాన్‌ బజార్‌లో తెరాస నేత రాజశేఖర్‌ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో మార్క్​ఫెడ్‌ వైస్‌ ఛైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, పురపాలక ఛైర్మన్‌ సూతకాని జైపాల్‌ సరుకులు అందించారు.

ఫోటో వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో...

జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వైరాలోని సభ్యులకు బియ్యం, సరుకులు అందజేశారు. వీటిని సంఘం బాధ్యులు రాజారావు, శ్రీనివాసరావు, పమ్మి రాజు, చలపతిరావు అందజేశారు. కరోనా లాక్​డౌన్​ ఉపాధిలేక ఇబ్బందుల్లో ఉన్న ఫోటో గ్రాఫర్‌లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

భాజపా ఆధ్వర్యంలో...

ఏన్కూరులో భాజపా మండల కమిటీ ఆధ్వర్యంలో కూలీలకు దుస్తులు, సరుకులు పింపిణీ చేశారు. పార్టీ జిల్లా నేతలు కొవ్వూరి నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు రమేశ్‌ తదితర నేతలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : లాక్​డౌన్​ 3.0లో ఏం చేయొచ్చు? ఏం చేయరాదు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.