తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు.
అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని రాములు నాయక్ అన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని ప్రజలకు సూచించారు. ప్రధానంగా రైతులకు, రుణమాఫీ, రైతుబంధు, మార్కెటింగ్ వసతులు కల్పించి వ్యవసాయానికి పెద్దపీట వేశారని కొనియాడారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్