ETV Bharat / state

ఎంపీడీవో కార్యాలయంలో వార్.. ఎంపీపీపై ప్రజాప్రతినిధులు ఫైర్​

కారేపల్లి మండలంలోని ప్రజాప్రతినిధుల మధ్య వివాదాలు బయటపడ్డాయి. ఏ సమాచారం ఇవ్వకుండా.. మండల అభివృద్ధి కమిటీని వేసి సమావేశం జరుపుతున్నారంటూ ప్రతినిధులు.. ఎంపీపీ శకుంతల దంపతుల​పై మండిపడ్డారు. కాసేపు ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది.

author img

By

Published : Apr 20, 2021, 8:39 PM IST

karepally mpdo office
karepally mpdo office

ఖమ్మం జిల్లా కారేపల్లి ఎంపీడీవో కార్యాలయం.. ప్రజాప్రతినిధుల నిరసనలు, నినాదాలతో మారుమోగింది. ఏ సమాచారం ఇవ్వకుండా కేవలం కొంతమందితో కమిటీ ఏలా వేస్తారంటూ ఎంపీపీ దంపతుల​పై వారంతా విరుచుకుపడ్డారు. ఒకానొక దశలో గొడవ ఉద్ధృతంగా మారి.. కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది.

మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇటీవలే కేంద్రం నుంచి రూ.60 లక్షల నిధులు విడుదలయ్యాయి. వీటికి సంబంధించి.. ఎంపీపీ శకుంతల, సర్పంచ్ అయినటువంటి ఆమె భర్త కిశోర్.. ప్రజాప్రతినిధుల్లో అందరికీ సమాచారమివ్వకుండా కేవలం అయిదుగురు సర్పంచులు, ఆరుగురు ఎంపీటీసీలతో కమిటీ వేశారు. దీంతో మిగతా వారంతా ఆగ్రహానికి గురయ్యారు. తాము ప్రజాప్రతినిధులము కాదా అంటూ నిలదీశారు.

మాకు నచ్చిన వారితో మేము కమిటీ వేసుకున్నామన్న ఎంపీపీ భర్త వ్యాఖ్యలతో .. అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు.. కార్యాలయానికి చేరుకుని గొడవను సద్దుమణిగించారు.

ఒక గిరిజన ప్రజాప్రతినిధిని అయినందుకే నాపై కుట్రలు చేస్తున్నారు. ఎంపీపీగా గెలవడమే నా దురదృష్టంగా భావించాలా? మండల అభివృద్ధి నిధుల్లో వాటా కావాలంటూ వేధిస్తున్నారు. నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఎంపీటీసీలతో ఫిర్యాదులు చేయిస్తున్నారు. దయచేసి.. మంత్రి, ఎమ్మెల్యే జోక్యం చేసుకుని నాకు న్యాయం జరిగేలా చూడాల్సిందిగా వేడుకుంటున్నాను.

- ఎంపీపీ శకుంతల

ఇదీ చదవండి: సీఎం కేసీఆర్​పై వివాదాస్పద వీడియోలు... కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.