తెరాసలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విలీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ హస్తం నాయకులు నిరసన చేపట్టారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి దిష్టి బొమ్మతో బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. బొమ్మను దగ్ధం చేసేందుకు నిరాకరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలోనే ఓ కార్యకర్త దిష్టిబొమ్మ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఒక్క సారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కొంత మంది కార్యకర్తల కండువాలకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
ఉద్రిక్తతల నడుమ కాంగ్రెస్ నిరసన - nlp
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేసుకోవాటాన్ని నిరసిస్తూ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది.