ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జడ్పీ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. పాలనాధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన గ్లోబరీనా సంస్థ, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: వనస్థలిపురం చోరీ... తమిళనాడు ముఠా పనేనా?