ETV Bharat / state

DGP : మరియమ్మ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు - dgp on mariamma lockup death

కస్టోడియల్​ డెత్​కు గురైన మరియమ్మకు న్యాయం జరిగేలా చూస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి(DGP) స్పష్టం చేశారు. ఆమె మరణానికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఖమ్మంలో పర్యటించిన ఆయన.. మరియమ్మ కుటుంబాన్ని పరామర్శించారు.

DGP, DGP Mahender Reddy, Mariamma Mriti, Lockup Death
డీజీపీ, డీజీపీ మహేందర్ రెడ్డి, మరియమ్మ మృతి, లాకప్ డెత్
author img

By

Published : Jun 27, 2021, 1:02 PM IST

Updated : Jun 27, 2021, 1:28 PM IST

ఖమ్మంలో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించారు. లాకప్​డెత్​కు గురైన మరియమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల ఆత్మహత్యకు యత్నించి.. ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడిని కలిశారు. అతని ఆరోగ్యంపై వైద్యులను ఆరా తీశారు. మరియమ్మ కుటుంబ సభ్యులతో ఆమె మృతి గురించి మాట్లాడారు.

మరియమ్మ మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. ప్రజల ఆత్మగౌరవం, ప్రాణాలకు భంగం కలగకుండా నడుచుకుంటాం. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను కొనసాగిస్తాం. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం సాయం ప్రకటించింది.

మహేందర్ రెడ్డి, డీజీపీ

అసలేం జరిగిందంటే...

ఈనెల 18న అడ్డగూడూరు పోలీస్ స్టేషన్​లో మరియమ్మ మృతిచెందడం రాష్ట్రవ్యాప్తంగా సంచలం రేపిన విషయం తెలిసిందే. దొంగతనం కేసు విచారణలో పీఎస్​కు తరలిస్తుండగా ఆవరణలోనే స్పృహతప్పి పడిపోవడం వల్ల భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు ఎస్సై వి.మహేశ్ చెప్పారు. మృతురాలి స్వగ్రామం ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడ. ఈ కేసులో ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులపై వేటు పడింది. ఎస్ఐ మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యపై సస్పెండ్ చేసిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్... తాజాగా చౌటుప్పల్ ఏసీపీని కమిషనరేట్​కు అటాచ్ చేశారు.

మరియమ్మ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు

ఇదీ చదవండి : మరియమ్మ కేసులో చౌటుప్పల్​ ఏసీపీపై వేటు

Last Updated : Jun 27, 2021, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.