ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండల కేంద్రంలో భక్త రామదాసు ధ్యాన మందిరంలో భక్త రామదాసు 387వ జయంతి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ హనుమంత్, భాషాసాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, అధికారులు పాల్గొన్నారు. భక్త రామదాసు 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
రామదాసు పేరిట ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. భక్త రామదాసు తెలంగాణ రాష్ట్రంలోని మొట్ట మొదటి వాగ్గేయకారుడని.. ఆయన కీర్తనలను దేశం నలుమూలలకు వ్యాపించే విధంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ముందుతరానికి ఆదర్శంగా ఉండేలా ధ్యాన మందిరాన్ని అభివృద్ధిపరుస్తానని ఉపేందర్ రెడ్డి తెలిపారు. ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో రామదాసును ప్రార్థించాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి: వాగ్దానాలు మరిచిన 'మంత్రిని నిలదీసిన మహిళ'