ETV Bharat / state

Crop Damage in Khammam District : పగబట్టిన వరుణుడు.. పీకల్లోతు కష్టాల్లో కర్షకుడు

author img

By

Published : May 7, 2023, 10:17 AM IST

Updated : May 7, 2023, 10:39 AM IST

Crop Damage in Khammam District : ఆశల పంట నేలవాలింది. అన్నదాత గుండె చెరువైంది. చేతికొచ్చిన పంటలు.. కేంద్రాల్లో తడిసి ముద్దవుతుంటే.. వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్న పంటలు గాలివానలకు నేలవాలుతుంటే.. కర్షకుడి హృదయం బరువెక్కుతోంది. రూ.లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబుడులు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్నదాతలు. మరోవైపు పంట దెబ్బతిన్న రైతులకు.. రూ.30 వేల పరిహారం ఇవ్వాలంటూ ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. భారీ ప్రదర్శనగా వెళ్లి.. కలెక్టర్‌కు పొంగులేటి వినతిపత్రం అందజేశారు.

Crop Damage in Khammam District
పగబట్టిన వరుణుడు.. పీకల్లోతు కష్టాల్లో కర్షకుడు

Crop Damage in Khammam District : మార్చి 19 నుంచి మే 1 వరకు అన్నదాతను ఊపిరిమెసలకుండా చేసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలు.. సాగుదారుల రూ.కోట్ల పెట్టుబడులను బూడిదలో పోసిన పన్నీరు చేశాయి. అకాల వర్షాలు, వడగండ్ల వానలతో మొత్తం ఖమ్మం జిల్లాలో 36,242 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. 21 వేల మంది రైతుల పంటలు నష్టపోయి పెట్టుబడులు కూడా మిగలని దయనీయ పరిస్థితి నెలకొంది. ఇందులో ప్రధానంగా మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రకృతి విపత్తులతో 50 శాతం పెట్టుబడులు తుడిచిపెట్టుకుపోయాయి. అంటే ఎకరాకు రైతు రూ.15 వేలు నష్టపోయారని అనుకుంటే.. జిల్లాలో మొక్కజొన్న రైతులకు సుమారు రూ.38 కోట్ల మేర నష్టం జరిగింది.
రూ.8 కోట్ల మేర నష్టం: ఇక వరి సాగుకు ఎకరాకు రూ.20 వేల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇందులో 50 శాతం పెట్టుబడులు కోల్పోయారనుకుంటే.. రూ.10 కోట్ల మేర నష్టాలు మూట గట్టుకున్నట్లయ్యింది. ఇలా మూడు దఫాల్లో జిల్లాలో మొక్కజొన్న, వరి రైతులకు మొత్తంగా రూ.48 కోట్ల మేర నష్టం వచ్చింది. ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మార్చి 19 నుంచి మే 1 వరకు వచ్చిన అకాల వర్షాలు, వడగండ్ల వానలతో... రైతులకు రూ.8 కోట్ల మేర నష్టం వాటిల్లింది. మొత్తం 3453 ఎకరాల్లో 1786 మంది రైతులు మొక్కజొన్న, వరి పంటలు నష్టపోయారు.

ప్రకృతి మింగిన పంట: కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు మూడడుగులు ముందుకు.. ఏడడుగులు వెనక్కి అన్నచందంగా సాగుతుండటంతో.. పంటను అమ్ముకునేందుకు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు అన్నదాతలు. ఈలోగా అకాల వర్షం వెంటాడితే విలవిల్లాడుతున్నారు. ప్రకృతి మింగిన పంట పోనూ మిగిలిన పంటను అమ్ముకుంటే.. మిల్లుకు తరలించిన తర్వాత కొర్రీల విధింపులతో తెల్లబోతున్నారు. ఈ సీజన్​లో ఉభయ జిల్లాల రైతులకు.. పెట్టుబడుల రూపంలో రూ.57.02 కోట్ల నష్టాలు మూటగట్టుకోవడం అన్నదాత దయనీయ దుస్థితికి అద్దం పడుతోంది.

ప్రతి ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలి: తక్షణమే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు.. ప్రతి ఎకరాకు రూ.30 వేలు పరిహారంగా చెల్లించాలని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతులను ఆదుకోవాలంటూ భారీ ఎత్తున రైతు భరోసా ర్యాలీ నిర్వహించారు. ఆయన క్యాంపు కార్యాలయం నుంచి.. వందలాది మంది ఆయన అభిమానులు, రైతులతో కలిసి కలెక్టరేట్‌ వరకు చేరుకున్నారు. కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ముఖ్యమైన వారిని లోపలికి అనుమతించారు.

వినతి పత్రం అందించిన పొంగులేటి: జిల్లా కలెక్టర్‌ను కలిసి పొంగులేటి వినతి పత్రం సమర్పించారు. 50 రోజుల కిందట అకాల వర్షాలతో పంటలు నష్టపోతే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొన్ని ప్రాంతాలను పరిశీలించి.. పరిహారం కింద ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. నేటికీ ఒక్క రైతు ఖాతాలో ఒక్క రూపాయీ పడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుకు కష్టం వస్తే తాను బాసటగా నిలుస్తానని... పొంగులేటి హామీ ఇచ్చారు.

వడగళ్ల వానలు.. రైతుకు తీరని కష్టాలు

ఇవీ చదవండి:

Last Updated : May 7, 2023, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.