దళితుల భూముల్లో పల్లె వనం ఏర్పాటును నిరసిస్తూ సీపీఎం నేతలు నిరసన చేపట్టారు. ఖమ్మం జిల్లా మధిర మండలం కంబంపాడులో భారీ ప్రదర్శన నిర్వహించారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తెరాస నేడు వారి భూములను సైతం లాక్కోవడం హేయమైన చర్య అని మండిపడ్డారు. దళితులకు అండగా సీపీఎం పార్టీ పోరాడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: 'రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెరాస పాలన'