కేంద్రం తక్షణమే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ ఖమ్మంలోని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. కొనిజర్ల మండలం చిన్న గోపతిలో వ్యవసాయ చట్టాల ప్రతులను భోగి మంటల్లో వేసి నేతలు నిరసన తెలిపారు.
రైతులు 50రోజులుగా ఆందోళన చేస్తున్నా.. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నేతలు మండిపడ్డారు. చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: సాగు చట్టాలను రద్దు చేసేవరకూ పోరాటం ఆగదు: శివరామకృష్ణ