సామాన్య, మధ్యతరగతి ప్రజల పాలిట గుదిబండలా మారిన ఎల్ఆర్ఎస్ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... ఖమ్మంలో సీపీఎం జిల్లా కమిటీ చేపట్టిన నగరపాలక సంస్థ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. నగరపాల సంస్థ కార్యాలయానికి భారీ ర్యాలీగా చేరుకున్న సీపీఎం కార్యకర్తలు... తొలుత కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
తర్వాత ఒక్కసారి కార్యాలయం గేట్లు తెరుచుకుని లోపలికి చొచ్చుకెళ్లారు. కమిషనర్ ఛాంబర్ వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు సర్ది చెప్పి వారిని మళ్లీ బయటకు పంపించారు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆరోపించారు.
వెంటనే ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెరాసకు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
ఇదీ చదవండిః భాగ్యనగరిలో 10లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు