ప్రధానమంత్రి ఈ కిసాన్ పథకాన్ని ఆరు వేల నుంచి 18 వేలకు పెంచాలని సీపీఎం డిమాండ్ చేసింది. కేంద్ర విద్యుత్ సంస్కరణల బిల్లును రద్దు చేయాలని, మధ్యాహ్న భోజనాన్ని ఇంటి వద్దకు పంపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం.. ప్రైవేటీకరణ కార్మిక చట్ట సవరణ ఆపాలని, కౌలు రైతులందరికి కౌలు కార్డు ఇచ్చి ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలకేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున ఇంటింటికి తిరిగి కరోనా టెస్టులు చేయాలని, తెల్ల రేషన్ కార్డు దారులకు ఆరు నెలల పాటు రూ.7500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
- ఇదీ చదవండి: నేర్పాలంటే... నేర్చుకోవాల్సిందే!