రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఖమ్మంలో సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. నగరంలోని ధర్నా చౌక్ వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లుతో దేశంలోని అన్నదాతల నడ్డి విరుస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు ఆరోపించారు. ఆ బిల్లులను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా లేని పక్షంలో రైతులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తారని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'వ్యవసాయ బిల్లుతో దేశానికి పొంచిఉన్న ప్రమాదం'