ఖమ్మంలో సీపీఎం ఆధ్వర్యంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ప్యాకేజీపై సమావేశం జరిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎమ్ఎస్ఎమ్ఈ పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా లేదన్నారు. వస్తు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలని వక్తలు అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం పెట్రోల్ ధరలు, కరెంటు రాయితీలు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సమావేశంలో సీపీఎం నాయకులు పోతినేని సుదర్శన్ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : నడుస్తున్న కారులో శబ్దం.. చేలరేగిన మంటలు