ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో రైతు పాదయాత్ర నిర్వహించారు. కార్పొరేట్ ప్రయోజనాల కోసమే మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమంతరావు వ్యాఖ్యానించారు. రైతులను అమ్మేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతు చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'నిరసన చేస్తే దేశద్రోహులు.. వారేమో స్నేహితులు'